సచిన్ వాజే మెర్సిడీజ్ కారు సీజ్

ముంబై: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని వదిలి వెళ్లిన ఘటనలో ఎన్ఐఏ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్ సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తాజాగా సచిన్ వాజే కారును సీజ్ చేశారు. నలుపు రంగు మెర్సిడీజ్ కారును సచిన్ వాజే వాడేవాడు. మార్చి 16వ తేదీన ఆ మెర్సిడీజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి 5 లక్షల నగదును, నోట్లు లెక్కబెట్టే మెషీన్‌తో పాటు అంబానీ ఇంటి ముందు ఉంచిన ఎస్యూవీ వాహన నెంబర్ ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నుంచి కొన్ని దుస్తులను కూడా ఎన్ఐఏ సీజ్ చేసింది. బ్లాక్ మెర్సిడీజ్ కారును సచిన్ వాడే నడిపేవాడు.. అయితే ఆ కారు ఓనర్ ఎవరన్న దానిపై విచారణ చేపడుతున్నట్లు ఎన్ఐఏ ఆఫీసర్ అనిల్ శుక్లా తెలిపారు.
ఫిబ్రవరి 25వ తేదీన ముంబైలోని ముఖేశ్ అంబానీ బిల్డింగ్ యాంటిలా ముందు పేలుడు పదార్ధాలతో ఉన్న స్కార్పియో వాహనాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఆ కారులో ఓ బెదిరింపు లేఖను కూడా వదిలివెళ్లారు. అయితే ఆ వాహనం థానేకు చెందిన మన్సూక్ హీరేన్‌ది అని తేలింది. ఫిబ్రవరి 17వ తేదీన తన కారు మాయమైనట్లు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ మార్చి 5వ తేదీన హీరన్ మృతిచెందాడు. సచిన్ వాజేనే తన భర్తను చంపినట్లు హీరన్ భార్య ఆరోపించింది. ప్రస్తుతం సచిన్ వాజేను అరెస్టు చేశారు. సచిన్ వాజే.. ఒసామా లాడెన్ కాదు అని, ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలని సీఎం ఉద్దవ్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

