హైదరాబాద్, ఏప్రిల్ 27: రెవోల్ట్ మోటర్.. తన ఫ్లాగ్షిప్ మోడల్ ‘ఆర్వీ400’ తిరిగి బుకింగ్‌లను ఆరంభించింది. హైదరాబాద్‌తోపాటు 20 నగరాల్లో బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. కంపెనీ వెబ్సైట్ www.revoltmotors.com లో రూ.9,999 చెల్లించి బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది. గతంలో విడుదల చేసిన ఈ మోడల్‌కు కొనుగోలుదారుల నుంచి వచ్చిన విశేష స్పందనతో మళ్లీ బుకింగ్‌లు ఆరంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.