లాక్టోజ్ రహిత పాల కోసం ఆవును రూపొందించిన రష్యన్ పరిశోధకులు…

మాస్కో,జూలై:రష్యాకు చెందిన పరిశోధకులు లాక్టోజ్ లేని పాలిచ్చే ఆవును తయారుచేశారు. మాస్కోలోని స్కోల్కోవో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్‌స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకులు రష్యాలో మొట్టమొదటి క్లోన్ ఆవు దూడను రూపొందించారు. ఈ దూడ 2020 ఏప్రిల్ 10న జన్మించింది. అప్పుడు 63 కిలోగ్రాములు ఉన్నది.శాస్త్రవేత్తలు ఆవుదూడ జన్యువులను విడదీసి,హైపోఆలెర్జెనిక్ పాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో మానవులలో లాక్టోజ్ అలెర్జీకి కారణమయ్యే బీటా-లాక్టోగ్లోబులిన్ను తొలగించగలిగారు. జన్యుపరంగా మార్పులు చేసిన ప్రయోగఫలితాలను ఇటీవల డోక్లాడీ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ జర్నల్ ల్లో ప్రచురించారు.
ఎర్నస్ట్ ఫెడరల్ సైన్స్ సెంటర్ ఫర్ యానిమల్ హస్బెండరీకి చెందిన గలీనా సింగినా నేతృత్వంలోని బృందం సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ (ఎస్సిఎన్టి) పద్ధతిని ఉపయోగించి ఆవు దూడను రూపొందించింది. ఈ ఆవుదూడ ను మొదటి సంవత్సరం తన తల్లితో పాటుఉంచారు. మే నెలలో ప్రతిరోజూ పచ్చిక బయళ్ళలో తిరిగే ఇతర ఆవులతో ఉంచారు.14 నెలల తరువాత ఆ దూడ 410 కిలోగ్రాములకు పైగా బరువున్నది. సాధారణ పునరుత్పత్తి చక్రంతో ఆరోగ్యంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. హైపోఆలెర్జెనిక్ పాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ ఆవును రూపొందించడం జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

