చెలరేగిన హార్దిక్ పాండ్యా.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
RR vs GT | ఐపీఎల్లో భాగంగా గురువారం రాజస్థాన్‌తో జరుగుతున్న రసవత్తర పోరులో గుజరాత్ భారీ స్కోర్‌నే చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రెండు ఓవర్లు ముగిసేలోపే మాథ్యూ వేడ్ (7), విజయ్ శంకర్ (2) ఔటయ్యారు. శుభ్‌మన్ గిల్ (13) పరుగులు తీయడంలో విఫలమయ్యాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే కీలక వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ నిలకడగా ఆడుతూ పరుగుల వేటలో ముందుకెళ్లింది. హార్దిక్ పాండ్యా (87 ) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అభినవ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (31) కూడా ధాటిగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి గుజరాత్ 192 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

