సూర్యాపేట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ఎన్ని డ్రామాలు చేసినా 22 ఏ( 22 A) పై చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ( Jagadish Reddy ) పేర్కొన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతరుల పై ఆరోపణలు చేసి తప్పించుకోవాలని తెలివితక్కువ వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రికి ప్రజల నుంచి శిక్ష తప్పదని హెచ్చరించారు.
చేతనైతే బీఆర్ఎస్ సభ్యులను శాసనసభకు అనుమతించి చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సభ నుంచి బయటకు పంపి బ్యాట్స్‌మెన్ లేకుండా కాంగ్రెస్ బౌలింగ్ చేస్తుందని విమర్శించారు. తమకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో సిక్సుల మోత మోగుతుందని అన్నారు. ఎర్రవల్లి భూముల సర్వేలో ప్రభుత్వానికి దళితుల నుంచి చుక్కెదురైందని వెల్లడించారు.
ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా సర్వే పేరిట ఫాం హౌస్ చుట్టూ తిరుగుతు న్నారని ఆరోపించారు. డ్రామా పొడిగింపు కోసమే ఎమ్మెల్యేలు , ఎంపీలను పంపుతామం టున్నారని ఆయన అన్నారు. కాలయాపన చేయడానికే హై లెవెల్ కమిటీ ని ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఎల్‌నినో పేరిట పేరిట డ్రామాలాడి ఆంధ్రాకు నీటిని పంపుతున్నారని ఆరోపించారు. రైతులు ఇప్పటికైనా మేల్కోవాలని , నమ్మి ఓటేసినందుకు గొయ్యి తొవ్వుతున్నారని అర్ధం చేసుకుని రైతులు తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.