Domestic Flights | వందశాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలకు అనుమతి
Restriction on domestic flights lifted | దేశీయ విమానాయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ

న్యూఢిల్లీ : దేశీయ విమానాయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానాల్లో ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీపై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 18 నుంచి ఆంక్షల ఎత్తివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇకపై విమానాలను వందశాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని పేర్కొంది.
వచ్చే సోమవారం నుంచి వందశాతం సామర్థ్యం విమానయాన సంస్థలు సర్వీసులను నడుపుకోవచ్చని పేర్కొన్న మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో దేశీయ విమానాలను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది.
గతేడాది డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ ఒకటిన ఆక్యుపెన్సీని 50శాతానికి తగ్గించింది. ఆగస్ట్ 12 నాటికి 72.5శాతానికి సీటింగ్ కెపాసిటీని పెంచింది.. సెప్టెంబర్‌లో 85శాతానికి పెంచగా.. తాజాగా పూర్తిస్థాయిలో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొవిడ్ వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేట్లను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

