Immunity Against Cancer | ఐఐఎస్సీ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ : క్యాన్సర్‌పై పోరాడే ఇమ్యూనిటీలో కీలక ముందడుగు
క్యాన్సర్ ఇమ్యూనోథెరఫీ (Immunity Against Cancer) ప్రభావాన్ని మెరుగుపరిచేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) పరిశోధకులు సంచలన ఆవిష్కరణను వెల్లడించారు.
న్యూఢిల్లీ : క్యాన్సర్ ఇమ్యూనోథెరఫీ (Immunity Against Cancer) ప్రభావాన్ని మెరుగుపరిచేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) పరిశోధకులు సంచలన ఆవిష్కరణను వెల్లడించారు. క్యాన్సర్ కణాలతో శరీర రోగనిరోధక వ్యవస్ధను పోరాడే విధంగా ప్రేరేపించే చికిత్సలో ఇది వినూత్న ఆవిష్కరణగా భావిస్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం, రోగనిరోధక ప్రతిస్పందనకు కీలకమైన సైటోకిన్ ఇంటర్ఫెరాన్-గామా (IFN-γ) యొక్క సంక్లిష్టమైన పాత్ర, వివిధ క్యాన్సర్ కణాలతో దాని పరస్పర చర్యను పరిశీలించింది.
సంప్రదాయ చికిత్సా పద్ధతులు కీమోథెరఫీ, రేడియేషన్ కంటే క్యాన్సర్ ఇమ్యునోథెరఫీ క్యాన్సర్ రోగుల పాలిట ఆశాకిరణంలా మారింది. కీమో, రేడియేషన్ ఆరోగ్యకర కణాలకు కూడా హానితలపెట్టనుండగా ఇమ్యూనోథెరఫీ లక్ష్యానికి మాత్రమే గురిపెట్టేలా సాగుతుంది. ఐఎఫ్ఎన్-ఐ³ యాక్టివేషన్‌కు వివిధ క్యాన్సర్ కణాలు ఎలా స్పందిస్తాయనే దానిపై పరిశోధన చేపట్టడం ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ఐఐఎస్సీ పరిశోధక బృందం దృష్టి సారించింది.
ఐఎఫ్ఎన్-ఐ³ టీ కణాల ద్వారా కణితి కణాలలో అపోప్టోసిన్ను ప్రేరేపిస్తాయి. కానీ ఐఎఫ్ఎన్లో దాని సిగ్నలింగ్ మార్గంలో లోపం ఉంటే క్యాన్సర్ కణాలు సమర్ధవంతంగా స్పందించకపోవచ్చని అధ్యయన తొలి రచయిత, ఐఐఎస్సీ బయోకెమిస్ట్రీ పీహెచ్డీ విధ్యార్ది అవిక్ ఛటోపాధ్యాయ్ చెప్పారు.ఇక ఐఎఫ్ఎన్ ఐతో క్యాన్సర్ కణాలకు చికిత్స చేసినప్పుడు, కణాల పెరుగుదల మాధ్యమం పసుపు రంగులోకి మారిందని, లాక్టిక్ యాసిడ్ విడుదల కారణంగా ఆమ్ల వాతావరణాన్ని సూచిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశీలన దీని వెనుక ఉన్న జీవక్రియ ప్రక్రియలను అన్వేషించే దిశగా పరిశోధకులను పురిగొల్పింది. ఇమ్యూనోధెరఫీలో ఐఎఫ్ఎన్-ఐ³ ట్యూమర్ వ్యతిరేక ప్రభావాలను నిర్ధేశిత జీవక్రియల మార్గాలు గుర్తించేందుకు మరింత పరిశోధన అవసరమని అధ్యయన రచయిత ప్రొఫెసర్ దీపాంకర్ నంది చెప్పారు.
Read More :
Fruits vs Fruit juice | పండ్లు, పండ్ల రసాల్లో ఆరోగ్యానికి ఏది మేలు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

