విద్యార్థులకు రవాణా భత్యం విడుదల

- 9,10 తరగతుల వారికీ వర్తింపు
- ఒక్కో విద్యార్థికి రూ.600
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దూర ప్రాంతాల నుంచి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రవాణా భత్యాన్ని విడుదల చేసింది. 2021- 22 సంవత్సరానికిగాను రూ.9.14 కోట్లను మంజూరుచేస్తూ జీవో జారీచేసింది. విద్యా హక్కు చట్టంప్రకారం విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలి లేదా భత్యం అందించాలి. చట్టం ప్రకారం 1-5వ తరగతి వరకు ఒక కిలోమీటర్, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకునే వారికి రవాణాభత్యం ఇవ్వాలి. ఇదివరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే భత్యం ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి 9,10 తరగతుల వారికి కూడా వర్తింపజేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా సదుపాయం లేని హ్యాబిటేషన్లు 3,150 ఉండగా, వాటిలో 30,488 మంది విద్యార్థులున్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరికీ నెలకు రూ.600 చొప్పున రవాణా భత్యంగా అందజేయనున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

