Realme 11 Pro+ 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) చరిత్రలో అసాధారణ మైలురాయి నమోదైంది. తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన రియల్ మీ 11 ప్రో+ 5జీ (Realme 11 Pro + 5G) ఫోన్ ఒక్క శుక్రవారం నాడే 60 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయింది. రూ.25 వేల పై చిలుకు ధరతో మార్కెట్లోకి విడుదలైన ఫోన్లలో రియల్మీ స్మార్ట్ ఫోన్లు తొలిరోజు సేల్స్ రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి.
రియల్మీ 10 ప్రో + 5జీ ఫోన్ కొనసాగింపుగా వచ్చిన రియల్మీ 11 ప్రో + 5జీ ఫోన్ (Realme 11 Pro + 5G).. 200 -మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్‌తో అందుబాటులో ఉంది. ఈ నెల 15న ఫ్లిప్‌కార్ట్, రియల్మీ డాట్ కామ్ వేదికగా రియల్మీ 11 ప్రో+ 5జీ సేల్స్ ప్రారంభం అయ్యాయి. 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్తోపాటు అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
రియల్మీ 11 ప్రో + 5జీ (Realme 11 Pro+ 5G) ఫోన్‌కు బ్రహ్మాండమైన ప్రతిస్పందన వచ్చిందని ట్విట్టర్ వేదికగా రియల్మీ ప్రకటించింది. ఒక్కరోజులోనే 60 వేలకు పైగా ఫోన్లు అమ్ముడయ్యాయని తెలిపింది. రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు ధర గల రియల్ మీ 11 ప్రో + 5జీ (Realme 11 Pro+ 5G), రియల్ మీ 11 ప్రో 5జీ (Realme 11 Pro 5G) ఫోన్లకు తొలి అత్యధిక ఫస్ట్ సేల్ రికార్డు అని పేర్కొంది.
రియల్మీ 11 ప్రో + 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 వద్ద మొదలవుతుంది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.29,999 పలుకుతుంది. ఈ ఫోన్లు ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్ రైజ్ బీజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రియల్మీ 11 ప్రో + 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే తో వస్తున్నది. ఇది ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ విత్ మాలి-జీ68 జీపీయూ 12 జీబీ రామ్ వరకు సామర్థ్యం కలిగి ఉంటది. ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ సెటప్‌తో ఉంటుంది. 200-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ 3 ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ తోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32- మెగా పిక్సెల్స్ కెమెరా కూడా ఉంటది.5000 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 100వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.