అది యాంటీ భారత్ సమ్మిట్: రాంచందర్‌రావు
హైదరాబాద్‌లో గురువారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగనున్నది ‘భారత్ సమ్మిట్' కాదని, అది యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ విదేశీ శక్తుల మద్దతుతో సాగుతుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో గురువారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగనున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని, అది యాంటీ భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ విదేశీ శక్తుల మద్దతుతో సాగుతుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే ‘రెజీమ్ చేంజ్’ అజెండాతో పనిచేస్తున్న ‘ప్రోగ్రెసివ్ అలయెన్స్’, జార్జ్ సోరోస్ వంటి శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు. స్పెయిన్, ఫ్రాన్స్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో తీవ్ర అలజడులు సృష్టించిన వామపక్ష, విదేశీ శక్తులను ఇప్పుడు హైదరాబాద్ వేదికగా భారత్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ తిరిగి లాంచ్ చేయడానికే ఈ సదస్సును తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఈ సదస్సును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

