సగటు మనిషి పోరాటమే ‘శేఖర్’
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ హిట్ ఫిల్మ్ జోసెఫ్‌కు రీమేక్‌గా దర్శకురాలు జీవిత రాజశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఆత్మీన్ రాజన్ నాయికగా నటిస్తున్నది. శివానీ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. బీరం సుధాకర్ రెడ్డి, శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 20న విడుదల కాబోతున్నది. తాజా ఇంటర్వ్యూలో జీవిత రాజశేఖర్ ఈ చిత్ర విశేషాలను తెలిపారు.
దర్శకత్వం చేయాల్సివచ్చింది..
నేను దర్శకురాలిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కొన్నిసార్లు మేము అనుకున్నది దర్శకుడు తెరకెక్కించలేకపోవడం వల్లనో, రాజశేఖర్ మనసులో ఉన్నది తెరపైకి రానప్పుడో..మేము కోరుకున్న దర్శకుడు దొరకనప్పుడు..అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మెగాఫోన్ పట్టాల్సివచ్చింది. ఈ సినిమాకు కూడా అలాగే జరిగింది. మలయాళంలో జోసెఫ్ సినిమా చూసినప్పుడు మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. మలయాళ చిత్రాల్లో కథనం చాలా నెమ్మదిగా, సహజంగా ఉంటుంది. మనకు కొంత వేగం కావాలి. మాతృకలోని ఫీల్ తగ్గకుండా రీమేక్ చేశాం.
సగటు మనిషిలా పోరాటం
ఇష్టమైన వాళ్లు దూరమైతే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. అలా ఒంటరిగా మిగిలిపోయిన మనిషిలో ఎలాంటి భావోద్వేగాలు ఏర్పడతాయి అనేది హీరో పాత్ర ద్వారా చూస్తారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం స్పందిస్తాం. శేఖర్ తన జీవితంలో ఎదురైన సమస్యను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఇందులో కథాంశం. తనొక పోలీస్ కానిస్టేబుల్. ఇందులో హీరో సగటు మనిషిలాగే పోరాడుతాడు.
సినిమాల్లో సూపర్ మ్యాన్ లా కనిపించడు. సహజమైన హీరోయిజం చూపించాం. రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాలో రాజశేఖర్‌తో ప్రతినాయక పాత్ర చేయించమని నేను దర్శక నిర్మాతలను అడిగాను. కానీ ఎందుకో కుదరలేదు. అర్థవంతమైన ప్రతినాయక పాత్రలు వస్తే ఆయన తప్పకుండా నటిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

