RRR ఫొటోల లీక్: టీంపై రాజమౌళి సీరియస్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రాజమౌళి సినిమా RRR షూటింగ్ ఫోటోలు బయటికి వస్తూనే ఉన్నాయి.. ఎవరో ఒకరు ఫోటోలు తీసి లీక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. అందులో భాగంగానే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఒక భారీ సెట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర రామ్ చరణ్ ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శక ధీరుడు. అయితే ఊహించని విధంగా ఈ సీన్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.
బ్రిటీష్ సైనికుడి కాస్ట్యూమ్‌లో ఉన్న రామ్ చరణ్.. ఒలివియాతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో రాజమౌళి చాలా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షూటింగ్ వివరాలు బయటికి రావడం.. ఫోటోలు లీక్ కావడం దర్శకుడికి ఏ మాత్రం నచ్చడం లేదు.. దాంతో షూటింగ్లో మొబైల్స్ తో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు అన్ని బ్యాన్ చేశాడు జక్కన్న. ఇకపై రూల్స్ ఇంకా కఠినతరం చేయనున్నాడు ఈ దర్శకుడు. అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వచ్చేది లేదని అల్టిమేటం జారీ చేశాడు.
ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. గతంలో కూడా బాహుబలి సమయంలో విడుదలకు ముందే కొన్ని సీన్స్ లీకయ్యాయి. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దీంతో మరింత జాగ్రత్తగా ఉండాలని ఫిక్సయిపోయాడు రాజమౌళి. ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. దీనికోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ వచ్చాడు. అక్కడే మరో నెల పాటు షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. 2021 అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కు యశ్ స్పెషల్ ట్రీట్..!
ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
అరణ్య అప్డేట్..రానా తండ్రిగా వెంకటేశ్..!
మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

