Vladimir Putin | భారత్‌తో దౌత్య బంధమే కాదు, సాంస్కృతిక బంధం కూడా ఉంది.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vladimir Putin | ష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌పై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమాలు (Indian Movies) అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. భారతీయ సినిమాలకు రష్యాలో చాలా పాపులారిటీ ఉందని చెప్పారు.
Vladimir Putin : రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్‌పై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమాలు (Indian Movies) అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. భారతీయ సినిమాలకు రష్యాలో చాలా పాపులారిటీ ఉందని చెప్పారు. సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ సినిమాలంటే తనకు చాలా ప్రేమ అని, అందుకే ఇండియన్ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నామని పుతిన్ తెలిపారు. భారత్ వెలుపల ఆ దేశానికి చెందిన సినిమాలను నిరంతరం ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానేనని అన్నారు. రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే గాక, సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందని పేర్కొన్నారు.
చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్న విషయాన్ని పుతిన్ గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా సినిమాలపై రష్యన్లు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారని అన్నారు. కాగా సోవియట్ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. రాజ్‌కపూర్, మిథున్ చక్రవర్తి లాంటి బాలీవుడ్ స్టార్ల పేర్లు ఇప్పటికీ ప్రతి రష్యన్ ఇంట్లో వినిపిస్తాయి.
ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్య సినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దాంతో బాలీవుడ్ చిత్రాలకు ఆదరణ పెరిగింది. 1982లో మిథున్ చక్రవర్తి నటించిన ‘డిస్కో డ్యాన్సర్’ మూవీ సోవియట్ యూనియన్‌లో ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమా చూసేందుకు జనాలు బారులు తీరారు. అది అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఆ సినిమాలోని ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ అనే పాట రష్యాలో మార్మోగిపోయింది.
కాగా, భారతీయ సినిమాలపై పుతిన్ తన ప్రేమను వ్యక్తపర్చడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బ్రిక్స్ సదస్సు సమయంలోనూ ఇండియన్ మూవీస్‌పై ఆయన స్పందించారు. ఇండియన్ మూవీస్‌ను ప్రచారం చేసేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

