పూల గుండె రాలిపడదా సామీ..

శ్రీవల్లి పల్లెటూరి పడతి. పుష్పరాజ్ అనే యువకుడిపై మనసుపారేసుకుంటుంది. తన మదిలోని వెలకట్టలేని ప్రేమను, సరససల్లాప భావనలను ఓ జానపద గీతిక ద్వారా వ్యక్త పరచాలనుకుంటుంది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ..నా సామీ..’ అంటూ ప్రియుడిని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఓ వలపు గీతాన్ని అందుకుంటుంది. మరి ఈ పాటలో పల్లెటూరి పడచు జంట ప్రేమాయణం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అంటున్నది ‘పుష్ప’ చిత్ర బృందం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకానుంది.
ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ‘సామీ నా సామీ..’ అనే జానపద శైలి గీతం సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. సోషల్‌మీడియా వేదికల్లో అత్యధిక వీక్షణలతో దూసుకుపోతున్నది. గ్రామీణ యువతి ప్రణయభావాలకు అద్దం పడుతూ అందరిని ఆకట్టుకుంటున్నది. ‘కొప్పులోన పూలు కొడితే..గప్పున నువ్ పీల్చుకుంటే పూలగుండె రాలిపడదా సామీ..’ అనే చరణాలు సరికొత్త అభివ్యక్తితో అలరిస్తున్నాయి. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

