గర్భాశయ గడ్డలకు.. గుమ్మడికాయ చికిత్స?
గర్భాశయ గడ్డలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందా? ఈ సమస్య ఉన్నవారు గుమ్మడికాయ వాడితే మంచిదని అంటారు. నిజమేనా
గర్భాశయ గడ్డలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందా? ఈ సమస్య ఉన్నవారు గుమ్మడికాయ వాడితే మంచిదని అంటారు. నిజమేనా?
గర్భాశయ గడ్డలు (యుటిరైన్ ఫైబ్రాయిడ్స్) ఉంటే పిల్లలు పుట్టరనే వాదనలో కొంత నిజం ఉంది. కానీ ఈ మాట 10 శాతం మందికి మాత్రమే వర్తిస్తుంది. పిల్లలను కనే వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉన్నప్పుడు, గర్భాశయంలోని పిండం ఎదుగుదలకు అవసరమైన పోషణ అందకపోవడం వల్ల అబార్షన్లకు ఆస్కారం ఎక్కువ. రుగ్మత ప్రాథమిక దశలో ఉన్న రోగులకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి.
సప్త వింశతి గుగ్గుళ్లు పూటకు రెండు చొప్పున మూడు పూటలా వాడాలి. కాంచనార గుగ్గుళ్లు పూటకు రెండు చొప్పున రెండుసార్లు తీసుకోవాలి. ముండి కషాయం 10 మి.లీ చొప్పున, మూడుసార్లు భోజనం తర్వాత వేసుకోవాలి. తరచూ పొట్ట నొప్పి వస్తుంటే.. హింగ్వస్తక చూర్ణాన్ని నెయ్యితో కలిపి ఒక స్పూన్ చొప్పున రెండుసార్లు (భోజనానికి ముందు) వేసుకోవాలి. కానీ, సొంత వైద్యం పనికిరాదు. ఆయుర్వేద గైనకాలజిస్ట్ పర్యవేక్షణలోనే ఇదంతా జరగాలి. గడ్డ పరిమాణాన్ని బట్టి చికిత్స వ్యవధి మారుతుంది. యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి బూడిద గుమ్మడి రసం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజూ తీసుకోవచ్చు. కాకపోతే, ప్రధాన వైద్యానికి ఇది ప్రత్యామ్నాయం కాదు.
– డా. యశోద పెనుబాల
ప్రసూతి &స్త్రీ వైద్య నిపుణులు
డా.బూర్గుల రామకృష్ణారావు
ఆయుర్వేద వైద్య కళాశాల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

