Pregnancy Tests | చైనా కంపెనీల నిర్వాకం.. మహిళా ఉద్యోగార్థులకు గర్భనిర్ధారణ పరీక్షలు
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
- పలు చైనా కంపెనీల నిర్వాకం
- ప్రభుత్వం చట్టపరమైన చర్యలు!
Pregnancy Tests | బీజింగ్, జూలై 17: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జియాంగ్షులోని నాన్టోంగ్ పట్టణంలో 16 కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది. నియామకాలు పొందిన 168 మంది మహిళలు, ముందస్తు ఫిజికల్ టెస్ట్‌లు చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్స్ గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా రెండు ప్రధాన దవాఖానలను, ఒక మెడికల్ ఎగ్జాం సెంటర్‌కు వెళ్లి ప్రాసిక్యూటర్స్ విచారించారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోయినా, పిల్లల్ని కనాలనుకునే ఉద్దేశమున్నా, గర్భంతో ఉన్నా.. అలాంటి మహిళలను ఇం టర్వ్యూ దశలోనే చైనాలోని పలు కంపెనీలు పక్కకు తప్పిస్తున్నాయి. వారికి ఉద్యో గం ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి. ప్రెగ్నె న్సీ టెస్ట్‌లు అడుగుతున్నాయి. అయితే ఇలా చేయటం చైనా చట్టాల ప్రకారం నేరం. ప్రెగ్నెన్సీతో ఉన్న కార్మికుల పట్ల వివక్ష చూపరాదు.
జిన్‌పింగ్‌కు స్ట్రోక్?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్ట్రోక్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నది ఆ దేశ సామాజిక మాధ్యమం. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన స్ట్రోక్‌కు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నది. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
ఆయనకు స్ట్రోక్ వచ్చిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించ లేదు. ఆయనకు స్ట్రోక్ వచ్చినట్టు జెన్నిఫర్ అనే రిపోర్టర్ వెల్లడించారు. 2021లో కూడా జిన్‌పింగ్ సెరిబ్రల్ ఎన్యూరిజంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

