పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సి స్పోర్ట్స్‌లో జరిగిన ‘రోడ్ టు నేషనల్స్’ పికిల్‌బాల్ టోర్నమెంట్ విజేత, రన్నరప్‌లకు వరంగల్ పికిల్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి రాకేష్ రెడ్డి ఇనుగాల అభినందనలు తెలిపారు.
న్యూశాయంపేట, అక్టోబర్ 12 : తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సి స్పోర్ట్స్‌లో జరిగిన ‘రోడ్ టు నేషనల్స్’ పికిల్‌బాల్ టోర్నమెంట్ విజేత, రన్నరప్‌లకు వరంగల్ పికిల్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి రాకేష్ రెడ్డి ఇనుగాల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు వేరువేరుగా మాట్లాడుతూ పికిల్ బాల్ టోర్నమెంట్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను అంకితభావంతో ప్రదర్శించారన్నారు.
ఈ టోర్నమెంట్లో సింగిల్స్ లో ప్రణీత్, రన్నరప్ గా కాటమ్ లక్ష్మా రెడ్డిలు,డబుల్స్ లో కాటమ్ లక్ష్మా రెడ్డి, నిమ్మ రామ్ రెడ్డిలు విజేతలుగా నిలిచారన్నారు. క్రీడాకారుల అద్భుత ప్రదర్శనలను వారు ప్రశంసించారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరింత కష్టపడి జాతీయ స్థాయిలో నిలిచి, తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పికిల్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మార్క సందీప్, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

