పంజాబ్ సీఎం ముఖ్య సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా

చండీగఢ్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పంజాబ్ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి నేను తాత్కాలిక విరామం తీసుకోవాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. నా ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, మీ ప్రిన్సిపల్ సలహాదారుగా నేను బాధ్యతలు చేపట్టలేకపోయాను. నా భవిష్యత్తు కార్యాచరణపై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతల నుండి నన్ను విముక్తి చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఈ లేఖ రాస్తున్నాను’ అని ప్రశాంత్ కిషోర్ అందులో పేర్కొన్నారు.
పంజాబ్ కాంగ్రెస్‌లో ఓ వైపు అంతర్గత పోరు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయం సీఎం అమరీందర్ సింగ్‌ను నిరాశపర్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రశాంత్ కిషోర్‌ను తన ప్రిన్సిపల్ సలహాదారుగా అమరీందర్ సింగ్ నియమించారు. ఆయనకు కేబినెట్ హాదా కూడా కల్పించారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆ బాధ్యతలను చేపట్టలేదని తెలుస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

