ప్రజ్వల సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్ : ప్రజ్వల ఆర్గనైజేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గురువారం ఉప్పల్‌లో జరిగాయి. ఈ సందర్భంగా 1కే రన్ నిర్వహించగా.. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ ప్రజ్వల సంస్థ మానవ అక్రమ రవాణాను నిర్మూలనకు ప్రతిష్టాత్మకమైన సంస్థ అన్నారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బంధించబడిన వేలాది మంది ప్రజ్వల సహాయంతో రక్షించబడ్డారన్నారు. రెస్క్యూ ఆపరేషన్ల తర్వాత బాధితులందరికీ ప్రజ్వల కేంద్రాల్లో పునరావసం కల్పించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం, పథకాల ద్వారా ఇండ్లు సైతం అందిస్తుందన్నారు. ఫౌండేషన్ పలువురు బాధితులకు వివాహం చేసుకొని సమాజంతో కలిసి బ్రతికేందుకు సహాయపడిందన్నారు.

మొదటల్లో ఫలక్‌నుమాలోని ఓ చిన్న భవనంలో ప్రజ్వల సంస్థ ప్రారంభమై.. నేడు పెద్ద వృక్షంగా మారిందని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సేవలందిస్తుందని సీపీ గుర్తు చేశారు. ఫౌండేషన్ రాబోయే 25 సంవత్సరాల్లో మానవ అక్రమ రవాణా లేని సమాజం కోరుకుంటుందన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు బాధితులు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా రాచకొండ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ బృందాలు మానవ అక్రమ రవాణాపై సమష్టిగా పోరాడాయన్నారు. భారత్‌తో పాటు ఉగాండా, టాంజానియా, నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాల నుంచి అనేక మంది బాధితులను రక్షించినట్లు చెప్పారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఐదేళ్లలో దాదాపు 700 మంది బాధితులను రక్షించామన్నారు. ప్రజ్వల సహాయంతో బాధితులందరికీ పునరావాసం కల్పించినట్లు సీపీ తెలిపారు. సునీత కృష్ణన్ మాట్లాడుతూ సమాజాన్ని మానవ అక్రమ రవాణా నుంచి విముక్తి చేసే లక్ష్యంగా ప్రజల్వ పని చేస్తుందన్నారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొనడం, ప్రోత్సహించడం దారుణమైన నేరమని, నాగరిక సమాజానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా ఓ ప్రధాన సమస్య అని, దాన్ని అంతం చేసేందుకు అనేక సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, రాజేశ్, మల్కాజ్గిరి, ఉప్పల్ ఏసీపీలు శ్యామ్ ప్రసాద్ రావు, ఎన్ రంగస్వామి, ఏహెచ్‌టీయూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ప్రజ్వలా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

