Loksabha Elections 2024 | ఎస్పీ హయాంలో మాఫియాకు అడ్డాగా యూపీ : ప్రధాని మోదీ
Loksabha Elections 2024 : తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్‌తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
Loksabha Elections 2024 : తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్‌తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసి తమ ఓ టును వృధా చేసుకోవాలని ఎవరకూ కోరుకోవడం లేదని చెప్పారు. మునిగే పార్టీకి ఓటు వేయాలని ఏ ఒక్కరూ కోరుకోరని వ్యాఖ్యానించారు.
ఏ ప్రభుత్వం కచ్చితంగా కొలువుతీరుతుందని నమ్ముతారో ఆ పార్టీకే సామాన్యుడు పట్టం కడతాడని పేర్కన్నారు. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కుల, కుటుంబ పార్టీలని, వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాతిపదికనే నిర్ణయాలు తీసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల్లో ఎంతో మంది సమర్దులు ఉన్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేవలం తన కుటుంబ సభ్యులకే పార్టీ టికెట్లు కేటాయిస్తారని ఆరోపించారు.
పట్టుబడిన ఉగ్రవాదులను కూడా ఎస్పీ నేతలు విడుదల చేస్తారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. యూపీ, పూర్వాంచల్‌ను వారు మాఫియాకు అడ్డాగా మార్చారని విస్మయం వ్యక్తం చేశారు. ఎస్పీ ప్రభుత్వంలో మాఫియాను కూడా ఓటు బ్యాంక్‌గా పరిగణించారని మోదీ పేర్కొన్నారు.
Read More :
Hezbollah | త్వరలో ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్.. హెచ్చరించిన హెబ్బొల్లా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

