డబ్ల్యూహెచ్‌వో చీఫ్ కొత్త పేరు తులసీభాయ్… పేరు పెట్టిన మోదీ
డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ హథనామ్కు ప్రధాని మోదీ కొత్త పేరు పెట్టారు. గుజరాత్‌లోని గాంధీ నగర్లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆయుశ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టెడ్రోస్ గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందరికీ నమస్కారం.. ఎలా వున్నారు? అంటూ గుజరాతీ భాషలో పలకరించారు. దీంతో సభికులందరూ చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. టెడ్రోస్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. తనకు ఇండియాకు చెందిన టీచరే చదువు బోధించారని తనతో చెప్పారని మోదీ పేర్కొన్నారు. తాను పక్కా గుజరాతీ అయిపోయానని, తనకు గుజరాతీ పేరును పెట్టాలని తనను కోరారని మోదీ వెల్లడించారు. దీంతో ఆయనకు తులసీ భాయ్ అని నామకరణం చేస్తున్నాని మోదీ సభలో పేర్కొన్నారు.
ఆయుశ్ విభాగంలో పెట్టుబడుల సదస్సు జరగడం ఇదే ప్రథమమని మోదీ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలు తమ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి ఆయుశ్ మందులు కూడా పనిచేశాయని పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుతో సంప్రదాయ వైద్యానికి నూతన శకం ఆరంభం కానుందని ప్రకటించారు. రాబోయే 25 ఏళ్లలో ఈ విభాగం ప్రపం చ మానవాళికి మరింత చేరువయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. ఔషధ మొక్కల పెంపకంలో వున్న రైతులు అత్యంత సులభంగా మార్కెట్‌తో కనెక్ట్ అవ్వడం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం కూడా ఆయుశ్ విభాగాన్ని ఆధునీకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్కెట్ స్థలాలను కూడా వెదుకుతోందని ప్రధాని మోదీ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

