డ్రోన్ టెక్నాలజీకి పెద్దపీట
ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడంలో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), తదితర టెక్నాలజీలను భారీ స్థాయిలో ఉపయోగించుకొంటున్నది.
- వినియోగంలో తెలంగాణ టాప్
- శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ
- టాప్ అకాడమీల్లో 4 తెలంగాణలోనే
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడంలో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), తదితర టెక్నాలజీలను భారీ స్థాయిలో ఉపయోగించుకొంటున్నది. వీటి ద్వారా ప్రజలకు అనేక రకాల సేవలను అందిస్తున్నది. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకొంటున్నది. అత్యవసర పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యంత వేగంగా మందులను సరఫరా చేసే డ్రోన్ టెక్నాలజీ ఇటీవల వికారాబాద్‌లో విజయవంతంగా పరీక్షించింది.
దేశంలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు నేరుగా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడేలా చూసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం, మైనింగ్ రంగాలతోపాటు రోడ్ల నిర్మాణం, భూముల సర్వే, ఫొటోగ్రఫీ, పోలీసింగ్ తదితర కార్యకలాపాలకు విస్తృతంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న చాలా పనులను భవిష్యత్తులో డ్రోన్లతో చేయించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తున్నది. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్‌షోలో విమానాలు, హెలికాప్టర్లతోపాటు పలు కంపెనీలు ప్రదర్శిస్తున్న విభిన్న రకాల డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
దేశంలోని టాప్-10 డ్రోన్ ట్రైనింగ్ అకాడమీలు
బాంబే ఫ్లయింగ్ క్లబ్, మహరాష్ట్ర (ప్రైవేట్)
ఫ్లైటెక్, తెలంగాణ (ప్రైవేట్)
వింగ్స్ ఏవియేషన్స్, తెలంగాణ (ప్రైవేట్)
అల్కెమిస్ట్ ఏవియేషన్, జార్ఖండ్ (ప్రైవేట్)
ఫాల్కన్ ఏవియేషన్, ఉత్తరప్రదేశ్ (ప్రైవేట్)
యాంబిషన్స్ ఏవియేషన్, ఉత్తరప్రదేశ్ (ప్రైవేట్)
ఏషియా పసిఫిక్ ఫ్లయిట్ ట్రైనింగ్, తెలంగాణ (ప్రైవేట్)
ఓరియంట్ ఫ్లైట్స్, తమిళనాడు (ప్రైవేట్ )
గతి, ఒడిశా (ప్రభుత్వ)
తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (ప్రభుత్వ)
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- drone
- Drone technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

