Plane gets stuck under bridge | వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్ జామ్
Plane gets stuck under bridge | ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. (Plane gets stuck under bridge) చివరకు అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ సంఘటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
పాట్నా: ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. (Plane gets stuck under bridge) చివరకు అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ సంఘటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బీహార్‌లోని మోతీహారిలో ఈ సంఘటన జరిగింది. విమానం బాడీని ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్నారు. అయితే బీహార్‌లోని మోతీహారీలో పిప్రకోఠి వంతెన కింద అది ఇరుక్కుపోయింది. దీంతో లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా క్రాస్ రోడ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాగా, గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఒక సంఘటన జరిగింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన భాగాన్ని ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా అండర్‌పాస్ వద్ద ఇరుక్కుపోయింది. అలాగే కోల్కతాలోపాటు పలు ప్రాంతాల్లో కూడా వంతెన కింద విమాన భాగాలు ఇరుక్కున్న సంఘటనలు జరిగాయి.
#BIHAR मोतिहारी में हवाई जहाज फ्लाईओवर के नीचे फंसा, देखने को लगी भीड़:
मोतिहारी के लोगों ने सुबह-सुबह देखा अजीब नजारा, पुलिस ने पहुंचकर किया रेस्क्यू pic.twitter.com/ByuoaVLrb9
— FirstBiharJharkhand (@firstbiharnews) December 29, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

