Peddi Sudarshan Reddy | సెప్టెంబర్ 2న కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి యాది సభ
పెద్ది సుదర్శన్‌రెడ్డి యాదిసభ సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం కాళోజీ కళాక్షేత్రంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పూర్వ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే అమరుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి యాదిసభ సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం కాళోజీ కళాక్షేత్రంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పూర్వ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో యాది సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్రి యాదవరెడ్డి, తెలంగాణ ఆకాంక్ష వేదిక జేఏసీ నేత రేపల్లె నరోత్తమసూరి, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సీఎస్ దినేష్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ర్ట నాయకులు యాదగిరిరెడ్డి, సిపిఐ రాష్ర్ట నాయకులు పాముల వెంకటరాములు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నున్న అప్పారావు, కేయూ ఉద్యమకారుడు సాదు రాజేష్ మాట్లాడారు.
పత్యేక రాష్ర్టం కావాలనే ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి, మలిదశ ఉద్యమంలో క్రియా శీలకు పాత్ర పోషించారని వారు గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప పెళ్లి చేసుకోనని తెలంగాణ వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తెలంగాణ వచ్చాక పెళ్లి చేసుకున్నారని, ఉద్యమకారుడు అమరుడు పెద్ద సుదర్శన్‌రెడ్డి మరణం బాధాకరమన్నారు. గతంలో బియ్యాల జనార్ధన్‌రావు, జయశంకర్ కాళోజి లాంటివారు మరణిస్తే ఎలా చేశామో ఇప్పుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి యాది సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అడ్వకేట్ అబ్దుల్ నబీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు జైసింగ్ రాథోడ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, కేయూ లెక్చరర్ మంద వీరస్వామి, సూత్రపు అనిల్, బిక్షపతినాయక్, ఫిరోజ్, వల్లివుల్లా ఖాద్రి, నీలం రాజకిషోర్, సురాసి కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

