Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు హృదయపూర్వక నివాళులు తెలియజేశారు. ఇవాళ జ్యోతిబా ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
Harish Rao : మహాత్మా జ్యోతిబా పూలేకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు హృదయపూర్వక నివాళులు తెలియజేశారు. ఇవాళ జ్యోతిబా ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. జ్యోతిబా పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన కుల వివక్ష, అస్పృశ్యత, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేశారని కొనియాడారు.
మహిళా విద్యను ప్రోత్సహించడానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిబా పూలే చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని హరీశ్‌రావు అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అందరికీ విద్య అనే ఆయన ఆశయాలను సాకారంచేసే దిశగా మనలను మనం తిరిగి అంకితం చేసుకోవడమే అంతటి గొప్ప వ్యక్తికి మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పారు.
మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే.
మహిళా విద్యకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సమానత్వం, సామాజిక న్యాయం, అందరికీ విద్య అనే వారి ఆశయాల సాధనకు పునరంకితం కావడమే ఆ మహనీయుడికి మనమిచ్చే నిజమైన నివాళి.
— Harish Rao Thanneeru (@BRSHarish) November 28, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మహాత్మా జ్యోతిబా పూలేకు హృదయపూర్వక నివాళులు : హరీశ్‌రావు
Mohabbat | యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘మొహబ్బత్’ సినిమాలోని ‘వరమే’ లవ్ సాంగ్!
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో రూ.60 కోట్ల అసైన్డ్ భూముల స్కాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Naga Chaitanya | ‘వృషకర్మ’ రిలీజ్ వేళ నాగచైతన్య సాహస యాత్ర.. పెద్దపల్లి రామగిరి కోటపై ట్రెక్కింగ్ చేస్తూ ఆసక్తికర ముచ్చట్లు!
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

