Ustaad Bhagat Singh | అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఇటీవలే సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. బ్రో నిర్మాతలకు కాసుల పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. బ్రో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవర్ స్టార్ అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ పవన్ కల్యాణ్ మ్యానరిజాన్ని ఎలివేట్ చేసేలా సాగుతూ విజువల్ ట్రీట్ అందిస్తోంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం మిడ్ ఆగస్టులో ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ షురూ కానుంది. పవన్ కల్యాణ్ నుంచి రాబోతున్న పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా లోడింగ్.. అంటూ తాజా అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో స్పెషల్ సెట్ వేయించారని తెలిసిందే. మరోవైపు ఓజీ షూటింగ్‌తో కూడా బిజీగాకానున్నాడు పవన్ కల్యాణ్.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..