Pawan Kalyan | పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు.. 4 గంట్లోనే డబ్బింగ్ పూర్తి చేశారా..!
Pawan Kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పవన్ అభిమానులకి మంచి వినోదం పంచనుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Pawan Kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పవన్ అభిమానులకి మంచి వినోదం పంచనుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. పగలు షూటింగ్ చేస్తూ.. రాత్రి డబ్బింగ్ చెపుతూ.. సినిమాలపట్ల తనకు ఉన్న అంకింత భావాన్ని చాటుకున్నారు. హరిహర వీరమల్లు కోసం నాలుగు గంటల్లోనే పవన్ డబ్బింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇతర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ ముగించిన తర్వాత రాత్రి 10 గంటలకు డబ్బింగ్ ప్రారంభించి, కేవలం 4 గంటల్లోనే డబ్బింగ్ మోత్తం పూర్తి చేశారు.
పవర్ తుఫానుకు రెడీగా ఉండండి. జూన్ 12న సినిమా థియేటర్లలో అడ్రినలిన్‌తో నిండిన రైడ్ కోసం వేచి చూడండి అంటూ చిత్ర బృందం ఎక్స్ లో తెలియజేసింది. పవన్ OG షూటింగ్ చేసి వచ్చి, అర్థరాత్రి 2 గంటల వరకూ ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది కదా మా పవర్ స్టార్ అంటే అని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ప్రేక్షకులలో బజ్‌ను తీసుకువస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ఈ చిత్ర నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లముడి సంయుక్తంగా మూవీని తెరకెక్కించారు.
ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. 18వ శతాబ్దం నాటి కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండగా నాజర్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, ఆదిత్య మీనన్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం టిక్కెట్ల అమ్మకాలు ఇప్పటికే విదేశాలలో ప్రారంభమయ్యాయి, కానీ భారతదేశంలో ఇంకా మొదలు కాలేదు. స్టార్ట్ అయితే మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

