Bhadradri : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు
Bhadradri : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు | భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. అలాగే స్వామివారికి అర్చకులు పవిత్రాలు ధరింపచేయనున్నారు. వరలక్ష్మీ

హైదరాబాద్ : భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే స్వామివారికి అర్చకులు పవిత్రాలు ధరింపచేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం విశేష తిరుమంజనం జరుగనుంది. ఉపాలయంలో లక్ష్మీతాయరు అమ్మవారికి విశేష తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల కారణంగా ఈ నెల 22వ తేదీ వరకు దేవస్థానంలో అధికారులు నిత్యకల్యాణాలు రద్దు చేశారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

