యూఎన్‌లో పాక్ ప్రధాని ఆరోపణల్ని ఖండించిన భారత్
United Nations India:ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. యూఎన్‌లోని ఇండియన్ మిషన్ కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. కశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. యూఎన్‌లోని ఇండియన్ మిషన్ కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ.. కశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు మిజిటో ఆరోపించారు. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు యూఎన్‌ను పాక్ ప్రధాని వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. స్వదేశంలో ఉన్న సమస్యల నుంచి తప్పుదోవ పట్టించేందుకు ఆయన ఇలా చేశారని వినిటో ఆరోపించారు. దావూద్ ఇబ్రహీం గురించి ప్రస్తావించిన భారత్.. శాంతి కావాలని ఆశిస్తున్న దేశం.. ఎన్నటికీ 1993 బాంబు పేలుళ్ల నిందితులకు ఆశ్రయాన్ని ఇవ్వదని అన్నారు. పాక్‌తో భారత్ స్నేహపూర్వక సంబంధాల్ని కోరుతున్నట్లు వినిటో తెలిపారు. ఉగ్రవాదం, ద్వేషం, హింస వద్దన్నారు. స్వదేశంలో మైనార్టీలను పట్టించుకోని పాకిస్థాన్.. ప్రపంచ స్థాయిలో మైనార్టీల రక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

