Newzealand : కెన్నింగ్టన్ ఓవల్ టెస్టులో భారీ విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్ పట్టేయాలనుకున్న కివీస్ కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయింది. ఓవల్‌లో శతకంతో రెచ్చిపోయిన గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips), 11 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచిన పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry)లు చివరి మ్యాచ్‌కు దూరమయ్యారు. దాంతో, నిర్ణయాత్మకమైన నాటింగ్హమ్లో టెస్టులో ఈ ఇద్దరు మ్యాచ్ విజేతలు లేకుండానే న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ పర్యటనలో 253 పరుగుల భారీ విజయంతో సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. 11 వికెట్లతో జట్టును గెలిపించిన మ్యాట్ హెన్రీలు గాయం కారణంగా మూడో మ్యాచ్‌కు దూరమయ్యారు.
Matt Henry, Player of the Match with 11 wickets in last week’s 253-run victory at The Oval, has been ruled out with a calf injury, while Glenn Phillips, who scored his maiden Test century in New Zealand’s first innings, has reported a side strain https://t.co/n0N44jDIZA
— Cricinfo (@cricinfo) June 25, 2026
‘ఓవల్ టెస్టు అనంతరం హెన్రీకి స్కానింగ్ చేశాం. అతడి ఎడమ కాలి పిక్క కండరాల్లో చిన్నపాటి చీలిక వచ్చింది. అతడు కోలుకునేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పట్టనుంది. పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న ఫిలిప్స్ కోలుకునేందుకు ఎన్ని రోజులు పడుతుంది? అనేది తెలియాల్సి ఉంది’ అని న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. నాటింగ్హమ్ టెస్టుకు ఒక్క రోజే ముందే ఈ ఇద్దరూ అందుబాటులో లేకపోవడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు విశ్లేషకులు. వీరిద్దరి స్థానంలో బెన్ సియర్స్, మిచెల్ శాంట్నర్ ఎంపికయ్యారు.