Ireland Cricket | వరల్డ్‌కప్ ఎఫెక్ట్.. భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు..!
Ireland Cricket : భారత్, ఐర్లాండ్ పొట్టి సిరీస్ షెడ్యూల్ మారింది. ఇది వరకు ప్రకటించిన సమయానికంటే గంట ముందే మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Ireland Cricket : భారత్, ఐర్లాండ్ పొట్టి సిరీస్ షెడ్యూల్ మారింది. ఇది వరకు ప్రకటించిన సమయానికంటే గంట ముందే మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఐర్లాండ్ క్రికెట్ (Ireland Cricket) ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, తమ జట్టు మద్య జరుగనున్న రెండు టీ20ల సమయాన్ని మార్చినట్టు బుధవారం రాత్రి ఆ దేశ బోర్డు వెల్డించింది.
ఐర్లాండ్ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. జూన్ 26న తొలి టీ20.. ఆపై ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా జూన్ 28న ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఉంది. లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు జరుగనుంది. దాంతో, రెండూ ఒకేసారి మొదలవ్వకూడదనే ఉద్దేశంతో.. ఆరోజు భారత్, ఐర్లాండ్ గేమ్‌ను గంట ముందు అంటే.. సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు ఐర్లాండ్ క్రికెట్, బీసీసీఐ అంగీకరించాయి. టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసే సోనీ స్పోర్ట్స్ సైతం షెడ్యూల్ మార్పునకు ఆమోదం తెలిపింది.
🚨 REPORTS 🚨
The two-match T20I series between Ireland and India will begin at 6 PM IST, one hour earlier in view of the India vs Australia Women’s T20 World Cup clash. 🇮🇪🇮🇳🏏
(Source: Cricbuzz)#IREvIND #T20Is #Sportskeeda pic.twitter.com/gfFGnFhG7d
— Sportskeeda (@Sportskeeda) June 25, 2026
అలానే.. ఇంగ్లండ్ పర్యటనలోనూ భారత జట్టు ఐదు టీ20ల సిరీస్‌లో మ్యాచ్‌ల సమయం కూడా తేడాగా ఉంది. రెండు, నాలుగో టీ20లు రాత్రి 7గంటలకు జరుగనుండగా.. మిగతా మూడు(ఒకటో, మూడో, ఐదో టీ20లు) మ్యాచ్‌లను రాత్రి 10 గంటలకు నిర్వహించనున్నారు. ఇక ఆగస్టులో మొదలయ్యే శ్రీలంక పర్యటన విషయంలోనూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు టెస్టుల సిరీస్‌కు అదనంగా మూడు టీ20 సిరీస్ ఉండదని స్పష్టం చేంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

