కోట్లు కుమ్మరించి ప్రచారం అంబేదర్కు అవమానం!
రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ను ఘోరంగా అవమానించిందనే విమర్శలొస్తున్నాయి.
- రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను మరిచిన సర్కార్
- కోట్ల ప్రజాధనంతో పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో అంబేద్కర్ ఫొటో మాయం
- భగ్గుమంటున్న దళిత, ప్రజా సంఘాలు
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో కనిపించని బాబాసాహెబ్ ఫొటో
- ఒకవైపు భారీ సైజులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో
- మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి, సీతక ఫొటోలు
- ఇందిరాగాంధీకి సైతం ప్రత్యేకంగా చోటు
- భగ్గుమంటున్న దళిత, ప్రజాసంఘాలు
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ను ఘోరంగా అవమానించిందనే విమర్శలొస్తున్నాయి. గురువారం రాజ్యాంగ దినోత్సవం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనంతో పత్రికలకు ఫుల్‌పేజీ ప్రకటనలు గుప్పించింది. కానీ, ఆ ప్రకటనల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోకు మాత్రం స్థానం కల్పించలేదు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఫొటోలను మాత్రం ప్రముఖంగా ముద్రించడం గమనార్హం.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోను సైతం ప్రత్యేకంగా ముద్రించారు. ఇంతమంది నేతల చిత్రాలకు చోటు కల్పించిన ప్రకటనల్లో అంబేదర్ ఫొటో మాత్రం కనిపించకపోవడం గమనార్హం. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాతకే గౌరవం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కన్నా, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులే ఎక్కువ అనేవిధంగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉన్నదనే ఆరోపణలొస్తున్నాయి. అంబేద్కర్ ఫొటో లేకపోవడాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా పలువురు అభివర్ణిస్తున్నారు. సీఎం, మంత్రుల ఫోటోలు ముద్రించాలని నిర్ణయించినప్పుడు, అంబేద్కర్ ఫోటో పెట్టాలనే కనీస ఆలోచన రాకపోవడం శోచనీయమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దళిత, ప్రజాసంఘాల ఆగ్రహం
ప్రభుత్వ ప్రకటనల్లో, అందులోనూ రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేదర్ ఫొటో లేకపోవడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతను విస్మరించడం ఆయనకు జరిగిన అవమానమేనని మండిపడుతున్నాయి. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, అంబేద్కర్‌పై నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అంబేద్కర్‌ను అవమానించినందుకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

