ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అవకాశం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ఎమర్జింగ్ టెక్నాలజీతో వైద్య సేవల విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సేవింగ్ లైఫ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగించారు. భారత కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి తర్వాత జపాన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకోబోతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూరప్ వంటి దేశాలతో పాటు ప్రపంచంలోని ఏ దేశమైన వైద్య రంగానికి సంబంధించిన సరిపడా మౌలికవసతుల కొరతను ఎత్తిచూపిందన్నారు.
అయితే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు ఒక సహకార పూరిత ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు గత సంవత్సర కాలంగా నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు. కరోనా లాంటి మహమ్మారి పైన సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తమ ప్రభుత్వం ముందువరుసలో ఉందని తెలిపారు. ముఖ్యంగా భూసంస్కరణలు ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామన్నారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృథా అని తమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆలోచనా విధానం మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు, సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు పోతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి సంబంధించిన ఆపత్కాలంలో టెక్నాలజీని ఉపయోగించుకొని కరోనా కట్టడి, వైద్య విద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు అందించడంలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమికస్థాయిలో ఉందని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రొన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో రువాండాకు చెందిన ఐటీశాఖ మంత్రి పౌల ఇనగంబిరే, ప్రపంచంలోని 45 ప్రముఖ వైద్య, సాంకేతిక టెక్నాలజీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

