Oppo A38 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) బడ్జెట్ ధరలో తన ఒప్పో ఏ38 ఫోన్ త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో ఏ38 ఫోన్ 6.56-అంగుళాల ఎల్సీడీ హెచ్డీ + డిస్ ప్లే విత్ 1612x 720 పిక్సెల్ రిజొల్యూషన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. గత సెప్టెంబర్ లో యూరో మార్కెట్ లో ఆవిష్కరించిన ఈ ఫోన్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.14,200 ( 159 యూరోలు) ఉంటుందని చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 13 విత్ ఒప్పో కలర్ ఓఎస్ 13 వర్షన్‌తో వస్తోంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్న ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది.