లఖింపూర్ ఖేరి ఘటనపై ‘సుప్రీం’ విచారణ.. యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన ధర్మాసనం
Lakhimpur Kheri Violence Case | లఖింపూర్ ఖేరి హింసాకాండపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన

న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి హింసాకాండపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండలో జర్నలిస్ట్ రమణ్ కశ్యప్, శ్యామ్ సుందర్ హత్య కేసు దర్యాప్తుపై విచారణ నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. సుమోటోగా నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపగా.. ఈ సదర్భంగా యూపీ ప్రభుత్వానికి పలు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు పశ్నలు సంధించింది.
ర్యాలీలో నాలుగైదువేల మంది రైతులు ఉంటే.. ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది దొరికారా? అని ప్రశ్నించింది. 164 నిబంధన కింద ఎందరు సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు..?, సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 68 మందిని సాక్షులుగా గుర్తించామని, 23 మందే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చారని కోర్టుకు తెలిపారు.
ధర్మాసనం స్పందిస్తూ ర్యాలీలో వందలాది మంది రైతులు ఉన్నారని, కేవలం 23 మంది సాక్షులు మాత్రమే వచ్చారా? అని కోర్టు ప్రశ్నించగా.. సాల్వే బదులిస్తూ వాగ్మూలం కోసం ప్రకటన జారీ చేశామని, వీడియో ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. విచారణ కొనసాగుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బలమైన సాక్షులను గుర్తించడం అవసరం, ఎవరైనా సాక్షులు గాయపడ్డారా? అని ప్రశ్నించింది. వీడియోను త్వరగా పరిశీలించాలని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇవ్వాలని, సాక్షులకు పూర్తి బాధ్యత కల్పించాలని యూపీ ప్రభుత్వానికి చెప్పింది. సాక్షులందరి వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

