పండుగలు, ప్రత్యేక సందర్భాలు వస్తున్నాయంటే చాలు.. ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ డిస్కౌంట్లతో రెచ్చగొడతాయి. అన్ని వస్తువులపైనా బంపర్ ఆఫర్లంటూ ఊరిస్తాయి. వాటిలో మనకు ఏది అత్యంత అవసరమో, దానిని మాత్రమే ఎంచుకోవాలి.
డెబిట్, క్రెడిట్ కార్డులకు ఓ పరిమితి నిర్ణయించుకోవాలి. దీనివల్ల వృథా ఖర్చు తగ్గుతుంది.
నిత్యం ఆన్లైన్ షాపింగ్ సైట్లను, యాప్‌లను బ్రౌజ్ చేస్తున్నట్లయితే.. తక్షణం వాటిని అన్-ఇన్స్టాల్ చేయండి. కొంపలేం మునిగిపోవు.
గతంలో మీరు కొన్న వస్తువుల్లో ఏది మీకు నిజంగా ఉపయోగపడుతున్నది, ఏది నిరుపయోగంగా ఉన్నది.. అన్న బేరీజు అవసరం. దీనివల్ల అనవసరమైన వాటి జోలికి అసలు వెళ్లరు.
ఆ నెలకు సరిపడా కుటుంబ బడ్జెట్‌ను రూపొందించండి. దీనివల్ల బడ్జెట్‌కు లోబడి మాత్రమే షాపింగ్ చేస్తారు.
తొందరపడి ఆన్లైన్లో ఏదైనా కొన్నా, ఉపయోగం లేదనిపిస్తే వెంటనే వాపసు చేయండి. మొహమాటం వద్దు.
బ్రౌజ్ చేసేటప్పుడు, నచ్చిన వస్తువులను వెంటనే కొనకుండా.. ‘కార్ట్’లో యాడ్ చేయండి. తిరిగి కార్ట్‌లోకి వెళ్లి ఆర్డరు చేయండి. దీనివల్ల ఆలోచించుకునే సమయం దొరుకుతుంది.