అబుధాబి: ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర జోస్ బట్లర్ (29) అవుటయ్యాడు. ఇష్ సోధి తన తొలి ఓవర్ తొలి బంతికే బట్లర్ వికెట్ తీసి న్యూజిల్యాండ్‌కు బ్రేకిచ్చాడు. సోధి వేసిన బంతిని స్వీప్ చేయబోయిన బట్లర్ మిస్సయ్యాడు. దీంతో ఆ బంతి నేరుగా వచ్చి అతని ప్యాడ్లను తాకింది. బట్లర్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది.
దీంతో ఇంగ్లండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో (13), బట్లర్ ఇద్దరూ పెవిలియన్ చేరినట్లయింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలన్ (5 నాటౌట్), మొయీన్ అలీ క్రీజులో ఉన్నారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 53/2 స్కోరుతో నిలిచింది.