ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకమైన సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. గురువారం న్యూఢిల్లీలో ఐఈఐ-ఎస్క్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఏజీఎం(ఈఎండీ) రజనీశ్చంద్ర సన్యాల్,
రామగుండం జ్యోతినగర్, అక్టోబర్ 23: ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకమైన సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. గురువారం న్యూఢిల్లీలో ఐఈఐ-ఎస్క్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఏజీఎం(ఈఎండీ) రజనీశ్చంద్ర సన్యాల్, సీనియర్ మేనేజర్ (సేప్టీ) ఏవీఎన్రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
విద్యుదుత్పత్తిలో అత్యంత ప్రాధాన్యతతో వినూత్న భద్రతా విధానాలను అమలు చేయడం, ఉద్యోగుల్లో భద్రతా అవగాహనను పెంపొందించడం వంటి అంశాల్లో ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు చేస్తున్న కృషి, నిబద్ధతకు ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డు లభించడం ఎన్టీపీసీ తెలంగాణకు గర్వకారణమని, సంస్థ భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పురస్కారం ప్రోత్సహిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

