Sarfaraz Khan | కలల ఆట కోసం సరదాలు వదిలేసి.. అహర్నిశలు శ్రమించిన సర్ఫరాజ్
Sarfaraz Khan : క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశంలో పుట్టిన సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) చిన్నప్పటి నుంచే ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. తండ్రి నౌషద్ ఖాన్(Noushad Khan) కోచింగ్‌లో రాటుదేలిన అతడు రంజీల్లో పరుగుల వరద పారించాడు. ఎట్టకేలకే ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో అతడి...
Sarfaraz Khan : క్రికెట్‌ను అమితంగా ప్రేమించే దేశంలో పుట్టిన సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) చిన్నప్పటి నుంచే ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. తండ్రి నౌషద్ ఖాన్(Noushad Khan) కోచింగ్‌లో రాటుదేలిన అతడు రంజీల్లో పరుగుల వరద పారించాడు. ముంబై జట్టు తరఫున సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకే ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో అతడి కల నిజమైంది. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) చేతుల మీదుగా సర్ఫరాజ్ టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఆ క్షణం అతడితో పాటు తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యారు.
కొడుకు చేతిలోని టెస్టు క్యాప్‌ను మురిపెంగా ముద్దాడిన నౌషద్ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు. కొడుకును భారత టెస్టు జట్టులో చూడాలనుకున్న తన కల నెరవేరినందుకు.. ఒక తండ్రిగా, కోచ్‌గా సక్సెస్ అయినందుకు నౌషద్ ఎంతో పొంగిపోయాడు. అయితే.. ఈ ప్రయాణమంతా అంత సులువుగా సాగలేదు. పేదింట్లో పుట్టిన సర్ఫరాజ్ క్రికెటర్ అయ్యేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. చిన్నప్పుడు సర్ఫరాజ్ పట్ల నౌషద్ ఎంతో కఠినంగా ఉండేవాడట.
From The Huddle! 🔊
A Test cap is special! 🫡
Words of wisdom from Anil Kumble & Dinesh Karthik that Sarfaraz Khan & Dhruv Jurel will remember for a long time 🗣️ 🗣️
You Can Not Miss This!
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @dhruvjurel21 |… pic.twitter.com/mVptzhW1v7
— BCCI (@BCCI) February 15, 2024

‘అవును.. నేను సర్ఫరాజ్ పట్ల కఠినంగా ప్రవర్తించేవాడిని. కానీ, అదంతా వాడి మంచికోసమే. కొన్నిసార్లు రాత్రి పూట అన్నం తిననిచ్చే వాడిని కాదు. దాంతో, బాధపడుతూనే నిద్రపోయేవాడు. మాకు కారు ఉన్నా సరే అతడిని రైలులోనే ప్రాక్టీస్‌కు పంపేవాడిని. జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయనేది స్వయంగా అనుభవంలోకి రావాలనే నేనలా చేసేవాడిని’ అని నౌషద్ తాజాగా వెల్లడించాడు.
పతంగులు ఎగరేయలేదు
‘భారత్‌కు ఆడాలన్నది నా కల. కానీ, నా వల్ల కాలేదు. ఇప్పుడు నాకొడుకు నాకలను నిజం చేశాడు. అతడి ద్వారా నేనే టెస్టు క్యాప్ ధరించాను అనిపించింది. చిన్నప్పటి నుంచి సర్ఫరాజ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. అందరిలా పతంగులు ఎగరేయలేదు. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయలేదు. క్రికెటర్ అవ్వాలనే కసితో ఉదయాన్నే లేచి ప్రాక్టీస్‌కు వెళ్లేవాడు. అయితే.. ఎంత బాగా ఆడినా సెలెక్టర్ల నుంచి మాత్రం పిలుపు అందలేదు. కానీ, ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. చివరకు ఆ అవకాశం రానే వచ్చింది. కుంబ్లే చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్న రోజు అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది’ అనిపించింది.
సర్ఫరాజ్ ఖాన్(62)

నౌషద్ తన చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించేందుకు, కొడుకు ఖర్చులు తీర్చేందుకు నానా ఇబ్బందులు పడ్డాడు. అదంతా చూసిన సర్ఫరాజ్ తండ్రి కష్టాన్ని వృథా చేయకుండా రంజీల్లో పరుగుల వరద పారించాడు. 2021, 2022 సీజనల్లో అతను వరుసగా 900లకు పైగా రన్స్ చేశాడు. దాంతో, టీమిండియాకు ఆడతానని అందరూ అనుకున్నారు. కానీ, ఆస్ట్రేలియా సిరీస్ తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన 17మందిలో అతడి పేరు లేదు. దాంతో, సర్ఫరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వెంకటేశ్ ప్రసాద్‌లు సర్ఫరాజ్‌కు దన్నుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి
- Gaami Teaser | మానవ స్పర్శ తెలియని అఘోర.. విశ్వక్ సేన్ ‘గామి’ టీజర్ రిలీజ్
- IND vs ENG 3rd Test | రాజ్‌కోట్ టెస్టులో నల్ల బ్యాడ్జీలతో భారత జట్టు.. కారణమిదే..!
- Dry Fruit Jewellery: సీమంతం కోసం డ్రై ఫ్రూట్ జ్వలరీ.. ఇన్‌స్టా వీడియో వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

