ఇష్టపూర్వక శృంగారం చేస్తే.. ఆధార్, ప్యాన్ చూడాల్సిన అవసరం లేదు
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనే వ్యక్తులు.. భాగస్వామి వయసు తెలుసుకునేందుకు ఆధార్, ప్యాన్ కార్డు చెక్ చేయాల్సిన అవసరం లేదని ఓ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. మైనర్‌ను రేప్ చేసినట్లు ఓ వ్యక్తిపై కేసు నమోదు అవ్వగా, అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జస్మీత్ సింగ్ విచారించారు. అయితే ఆ మహిళకు రికార్డుల ప్రకారం మూడు రకాల పుట్టినరోజులు ఉన్నాయని, రేప్ జరిగిన నాటికి ఆమె మైనర్ కాదు అని కోర్టు అభిప్రాయపడింది.
ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి .. తన భాగస్వామి డేట్ ఆఫ్ బర్త్ను తెలుసుకోవాల్సిన అవసరం లేదని, దాని కోసం ఆ వ్యక్తి ఆధార్, ప్యాన్ కార్డును పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. ఆధార్ కార్డులో ఆ మహిళ పుట్టిన రోజు 01.01.1998గా ఉందని, ఈ ఒక్క ఆధారంతో ఆమె మైనర్ కాదు అని తెలుస్తోందని జడ్జి తెలిపారు. అయితే అమ్మాయికి భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, బెయిల్ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం అవుతుందని కోర్టు తెలిపింది. హనీ ట్రాపింగ్ కేసుల గురించి జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. పోలీసులు అలాంటి కేసుల్ని సునిశితంగా విచారించాలని ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- aadhaar
- Delhi High Court
- PAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

