Omicron | ఒమిక్రాన్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. కోలుకున్న పేషెంట్ వీడియో సందేశం
Omicron | ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు అంత భయపడాల్సిన అవసరం లేదని ఇటీవలే ఒమిక్రాన్ నుంచి కోలుకున్న పేషెంట్ చెప్పాడు.

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు అంత భయపడాల్సిన అవసరం లేదని ఇటీవలే ఒమిక్రాన్ నుంచి కోలుకున్న పేషెంట్ చెప్పాడు. కర్ణాటకకు చెందిన సదరు వ్యక్తి సౌతాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చాడు. ఇక్కడే అతనికి ఒమిక్రాన్ సోకినట్లు తెలిసింది.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం తాజాగా 34 ఏళ్ల ఈ వ్యక్తి కోలుకున్నాడు. ఈ క్రమంలోనే తన అనుభవాలను వివరిస్తూ ఒక వీడియో సందేశం ఇచ్చాడు. తనకు ఒమిక్రాన్ సోకినా కూడా విపరీతమైన లక్షణాలేవీ కనిపించలేదని చెప్పాడు.
తనకు ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు చెప్పిన తర్వాత కూడా ఆందోళన చెందకుండా, కరోనా నిబంధనలు పాటిస్తూ వచ్చానన్నాడు. ఒమిక్రాన్ లక్షణాలు చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయని, కాబట్టి ఈ వేరియంట్‌ను చూసి మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని వివరించాడు.
తాను గతేడాది డెల్టా వేరియంట్ బారిన పడ్డానని, అప్పటితో పోల్చుకుంటే ఒమిక్రాన్ వల్ల తను పడ్డ ఇబ్బంది తక్కువే అని వివరించాడు. ఒమిక్రాన్ కన్నా తనను డెల్టా వేరియంటే అధికంగా బాధించిందన్నాడు. కర్ణాటకలో ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

