అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన

పాట్నా: ‘మీ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ అధికారులను కర్రతో కొట్టండి’ అన్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. తన నియోజకవర్గమైన బెగుసారైలో శనివారం పర్యటించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖోదవండుపూర్లోని వ్యవసాయ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘మీ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ అధికారులను కర్రతో కొట్టండి’ అని తన నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అధికారులు తమ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పేద ప్రజల నుంచి తనకు తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు.
‘అలాంటి ప్రజలకు ఒకటే చెబుతున్నాను. చిన్న చిన్న పనుల కోసం నా వద్దకు మీరు ఎందుకు వస్తున్నారు?. ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్, జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలి. వారు మీ మాట వినకపోతే.. రెండు చేతులతో వెదురు కర్ర పట్టుకుని వారి తల పగులగొట్టండి. అయినప్పటికీ వారు పని చేయకపోతే, అప్పుడు నా వద్దకు రండి’ అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన గిరిరాజ్ వ్యాఖ్యలపై స్పందించాలని సీఎం నితీశ్ కుమార్‌ను మీడియా అడిగింది. ఇలాంటి వ్యాఖ్యలపై మీరు ఏమంటారు అని ప్రశ్నించింది. స్పందించిన నితీశ్.. కొట్టండి లాంటి పదాలు వాడటం సరైందా కాదా అన్నది ఆయన ( కేంద్ర మంత్రి గిరిరాజ్)నే అడగాలని చెప్పారు. దీని గురించి ఇక ఏమీ మాట్లాడబోనని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

