కరోనా కొత్త వేవ్.. 20-39 మధ్య వయస్కులపై ప్రభావం!
కరోనా | కరోనా సెకండ్ వేవ్ మధ్య యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది.

బెంగళూరు : కరోనా సెకండ్ వేవ్ మధ్య యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మొదటి వేవ్‌లో వృద్ధులపై ప్రభావం చూపగా.. ఇప్పుడు పెద్దగా వారిలో తీవ్రత కనిపించడం లేదని బెంగళూరు వైద్యులు గుర్తించారు. మార్చి మధ్య నాటి నుంచి కరోనా కేసులు పెరిగిన నాటి నుంచి బెంగళూరులో వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన వారిలో 20-39 మధ్య వయస్సున వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీల మధ్య 20-29 సంవత్సరాల వయస్సున్న వారు 2,408 మంది, 30-39 సంవత్సరాల వయస్సున 2,547 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే డేటా పేర్కొంది. 60-69 మధ్య 1,178 మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 828 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ ట్రాన్‌మిసిబిలిటీ పెరగడం, ప్రజల ప్రవర్తనే ఈ పరిస్థితికి దారి తీసిందని వైద్యులు పేర్కొంటున్నారు.
వారికి టీకా వేసేందుకు అనుమతివ్వాలి
ఆస్టర్ సీఎంఏ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ బ్రూన్డా మాట్లాడుతూ 35-40 ఏళ్ల వయస్సున్న చాలా మందికి వైరస్ బారినపడడం చూస్తున్నామన్నారు. ఇందులో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు మొదలైన లక్షణాలతో కేసులు వస్తున్నాయని, మొదటి వేవ్‌తో పోలిస్తే ప్రసార రేటు ఎక్కువని, లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని పరిమితం చేసిందని పేర్కొన్నారు. అయితే సెకండ్ వేవ్‌లో టీకా అందుబాటులోకి రావడంతో ప్రజల కదలిక ఎక్కువై.. ప్రసార రేటు పెరిగిందని చెప్పారు. టీకాలు వేయడంతో వృద్ధుల్లో సంక్రమణ రేటు తగ్గిపోవచ్చునని.. కానీ, చాలా మంది మధ్య వయస్సులు వైరస్ బారినపడుతున్నట్లు చూస్తున్నందున టీకా వేసేందుకు 35 సంవత్సరాలకు తగ్గించడాన్ని కేంద్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జయానగర్‌లోని మణిపాల్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ అరవింద జీఎం మాట్లాడుతూ 20-30 మధ్య వయస్సుల్లో 10 నుంచి 20శాతం పెరుగుదల అంచనా వేశారని, ఇందులో చాలా మందికి జీర్ణాశయాంతరలక్షణాలున్నాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మొదటి వేవ్‌లో మాదిరిగా మరణాలు
యశ్వంత్‌పూర్‌లోని కొలంబియా ఆసియా రెఫరల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ రంగప్ప మాట్లాడుతూ.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని, కానీ రాబోయే కొద్ది వారాల్లో ఐసీయూ, హాస్పిటల్‌కు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నారు. మొదటి వేవ్‌లో చూసిన విధంగానే మరణాలు చూడాల్సి వస్తుందని.. అలాంటి దశలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఐసీయూ పడకలు పెంచడం ప్రారంభించాలని, టీకాలు అందుబాటులో ఉంచాలన్నారు. చాలా ఆసుపత్రులు కొవిడ్ రోగులను అనుమతించడం లేదని, కేంద్రీకృత మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రభుత్వం తిరిగి అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్టర్ రంగప్ప అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. బావిలో ఐదుగురి దుర్మరణం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

