శత్రుభయంకరుడు వీరమల్లు. దుష్టశిక్షణ శిష్టరక్షణ అతని సిద్ధాంతం. వీరమల్లు ఆయుధం చేబూనితే ఎంతటి ప్రత్యర్థి అయినా చిత్తు కావాల్సిందే. మరి వీరమల్లు పోరాటం ఎవరి మీదో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు క్రిష్. ఆయన దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. పదిహేడవ శతాబ్దం నాటి కథతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. పవన్‌కల్యాణ్ పాల్గొనగా భారీ పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సెట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్స్‌లో పవన్‌కల్యాణ్ బల్లెం ధరించి పోరాటానికి సిద్ధమైన యోధుడిగా కనిపిస్తున్నారు. కథ తాలూకు చారిత్రక నేపథ్యాన్ని స్ఫురించేలా ఆయన ఆహార్యం ప్రత్యేకంగా కనిపిస్తున్నది. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.