T20 World Cup Final AUS vs NZ : నెటిజన్లు చెప్పిందే నిజమైంది.. ఆ సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అయింది
నెటిజన్లు చెప్పిందే నిజమైంది | టీ20 వరల్డ్ కప్ 2021 టైటిల్ విన్నర్ ఎవరో నెటిజన్లు మ్యాచ్‌కు ముందే చెప్పేశారు. టీ20 వరల్డ్ కప్‌లో ఓ సెంటిమెంట్ ఉందని
టీ20 వరల్డ్ కప్ 2021 టైటిల్ విన్నర్ ఎవరో నెటిజన్లు మ్యాచ్‌కు ముందే చెప్పేశారు. టీ20 వరల్డ్ కప్‌లో ఓ సెంటిమెంట్ ఉందని.. ఆ సెంటిమెంట్ ఒక్కసారి తప్పించి అన్నిసార్లు వర్కవుట్ అయిందని.. ఈసారి కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

ఫైనల్స్‌లో అర్హత సాధించిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ పోరుకు ముందు దిగిన ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఏ జట్టు కెప్టెన్ అయితే ఉన్నాడో ఆ టీమే టీ20 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ అవుతుందని నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఆ ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎవరో కాదు.. ఆసీస్ కెప్టెన్ ఆరున్ ఫించ్. దీంతో ఆస్ట్రేలియా గెలుస్తుందని వాళ్లు జోస్యం చెప్పారు. వాళ్లు చెప్పినట్టే అదే నిజం అయింది. ఆస్ట్రేలియానే టీ20 వరల్డ్ కప్‌ను తొలిసారి ముద్దాడింది.
ఇదివరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో కూడా అదే జరిగింది. ఒక్క 2014లో మాత్రం గురితప్పింది. 2014లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన పోరులో శ్రీలంక కప్ సాధించింది. ఆ ఒక్కసారి మాత్రం మిస్ అయింది. మిగితా అన్ని మ్యాచ్‌లలో ఎడమవైపున నిలుచున్న కెప్టెన్ టీమే ట్రోఫీని ఎగరేసుకుపోయింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో డిబేట్ పెట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

