వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం.. అధికారులకు షోకాజ్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు.

మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు. కొవిడ్ వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాగా కోయిల్‌కొండ మండల కేంద్రం పరిధిలో ప్రతిరోజు వంద మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. పరిశీలనకు వెళ్లిన రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావుకు 9 మందికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం, అంతేకాక వ్యాక్సినేషన్ పై అనుకున్న స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టని విషయాన్నికలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన కలెక్టర్ తక్షణమే పైన పేర్కొన్న వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
అంతేకాక డ్రైవ్ పై నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కానందుకు జిల్లా నెడ్ క్యాప్ అధికారి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఏడిలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సమీక్షించారు.
18 ఏండ్లు నిండిన వారు టీకా వేసుకునేందుకు కల్పిస్తున్న అవగాహన, డోర్ టూ డోర్ సర్వే, ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించడం అంశాలపై కలెక్టర్ అడిగి తెలసుకున్నారు. అంతేకాక టీకా కేంద్రాల వద్ద సిబ్బందికి భోజనం ఏర్పాట్లు, తాగునీరు వంటి సౌకర్యాల పై ఆరా తీశారు. 100 శాతం విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ తప్పనిసరిగా కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ ఇవ్వాలన్న స్థిరమైన లక్ష్యంతో పని చేయాలనారు. వంద శాతం టీకా పూర్తయిన చోట బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీవోలు కె స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

