అక్కడికి వెళ్లాలంటే.. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి!
అక్కడికి వెళ్లాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అయితే, మూడుశాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి ప్రయాణించే

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అయితే, మూడుశాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి ప్రయాణించే వారికే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందం ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త మార్గదర్శకాల.. మేరకు ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణించే ఎవరైనా నెగెటివ్ కొవిడ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది.
వాయు, రహదారి, రైలు మార్గాల ద్వారా వచ్చే వారికి కొత్త నిబంధన వర్తించనుంది. వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే వ్యక్తులు ప్రోటోకాల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అయితే, వ్యాక్సిన్ రెండు మోతాదులను పొందిన వ్యక్తులను కొత్త మార్గదర్శకాల నుంచి తప్పించాలా? వద్దా? నూతన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత తెలియనుంది. మరో వైపు రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ వేగంగా యాంటిజెన్ పరీక్షలు, థర్మర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్‌తో పాటు ఇతర కొవిడ్ ప్రోటోకాల్‌లను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. యూపీలో గత 24 గంటల్లో 56 కొవిడ్ కేసులు నమోదవగా.. 69 మంది కోలుకున్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని అదనపు చీఫ్ సెక్రెటరీ నవనీత్ సెహగల్ పేర్కొన్నారు. యూపీలో రికవరీ రేటు 98.6శాతానికి పెరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

