స్టాక్‌హోమ్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా.. ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్‌లో సూపర్ షో కనబరిచాడు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఈవెంట్లో నీరజ్ తన జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరి సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నీరజ్ తన జాతీయ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. జూన్ 14వ తేదీన నెలకొల్పిన జాతీయ రికార్డును గురువారం జరిగిన ఈవెంట్లో బద్దలు కొట్టాడు. ఇటీవల తుర్కులో జరిగిన పావే నుర్మి గేమ్స్‌లో నీరజ్ తన జావెలిన్‌ను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే డైమెండ్ లీగ్‌లో ఆ రికార్డును కూడా దాటేశాడు.
డైమెండ్ లీగ్‌లో వరల్డ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 90 మీటర్ల మార్క్‌ను బ్రేక్ చేశాడతను. పీటర్స్ తన జావెలిన్‌ను 90.31 మీటర్ల దూరం విసిరి కొత్త మీట్ రికార్డును స్థాపించాడు. పీటర్స్‌కు స్వర్ణ పతకం దక్కగా, జులియన్ వెబర్‌కు బ్రాంజ్ మెడల్ దక్కింది. ఇక జూలై 15వ తేదీ నుంచి 24 వరకు అమెరికాలోని యూజీన్‌లో జరగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా తన సత్తా చాటనున్నాడు.
సిల్వర్ గెలిచిన నీరజ్‌కు కంగ్రాట్స్ మెసేజ్‌లు అందుతున్నాయి. గతంలో 2003లో అంజూ బాబీ జార్జ్ ఇదే డైమెండ్ లీగ్ టోర్నీలో లాంగ్ జంప్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నది.నీరజ్ రికార్డు పట్ల గర్వంగా ఉందని అంజూ బాబీ జార్జ్ ట్వీట్ చేసింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు గుడ్‌లక్ చెప్పిందామె.
https://t.co/2c8UFFxLQp so proud of u @Neeraj_chopra1.After the 2003 long jump silver, this is our country's second one from the same Sweden Stockholm. good luck for the world championships @Media_SAI @afiindia pic.twitter.com/t1ibVWQxVr
— Anju Bobby George (@anjubobbygeorg1) July 1, 2022
Olympic Champion @Neeraj_chopra1 sets the new National Record and Personal Best at 2022 #StockholmDL with a throw of 89.94m, finishing 2nd
Take a look at the record breaking throw! pic.twitter.com/r3X7IK7LSp
— Anurag Thakur (@ianuragthakur) July 1, 2022