వివాహ వేడుకలకు సంబంధించిన ఆసక్తికర, ఆహ్లాదకరమైన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కేరళలో జరిగిన తన వివాహ వేడుకలో ఓ భారత నావికాదళ అధికారి పుష్ అప్స్ చేసే వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇది నెటిజన్లను కట్టిపడేస్తున్నది.
‘ఆర్చ్ ఆఫ్ సాబర్స్ వేడుక’ అనేది వివాహ సంప్రదాయం. ఇందులో కొత్తగా పెళ్లయిన జంటకు సెల్యూట్ చేసేందుకు కత్తులు (సాబర్స్) ఉపయోగిస్తారు. నూతన వధూవరులు అధికారుల నుంచి సాంప్రదాయక కత్తి వందనం స్వీకరించిన తర్వాత, వరుడి స్నేహితులు సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేవీ అధికారిని పుష్ అప్స్ చేయాలని కోరారు. వారి కోరిక మేరకు ఆ ఆఫీసర్ పుష్ అప్స్ చేస్తూ..పైకి లేచిన ప్రతిసారీ ‘ఐ లవ్ ఎలెనా’ అంటూ అరిచాడు. ఈ హృదయపూర్వకమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. చాలా మంది కామెంట్ సెక్షన్లో “జై హింద్” అని రాశారు.