మన అగ్ర హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు. తాజాగా వీరిలో చేరారు నాని. ఆయన కొత్త సినిమా ‘దసరా’ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆదివారం సినిమా నుంచి స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో లుంగీ కట్టుకుని నాని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో బీడి, నడుముకు లిక్కర్ బాటిల్స్ వేలాడుతున్నాయి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతంలో తన గ్యాంగ్‌తో నాని నడుస్తూ వచ్చిన ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గర ఉన్న ఒక గ్రామంలో ‘దసరా’ కథ సాగనుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో మాస్ యాక్షన్ పాత్రలో నాని కనిపిస్తారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహాబ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సంతోష్ నారాయణన్, ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్సీ, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల.